ఉన్నత విద్యామండలి పనితీరు సరిగా లేదు
డిప్యూటీ సీఎం కడియం అసహనం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఉన్నత విద్యా మండలి పనితీరు సరిగా లేదంటూ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అసహనం వ్యక్తంచేశారు. అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్షా అభియాన్ రిసోర్స్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులతో సమావేశం నిర్వహిం చారు.
కళాశాల విద్య శాఖ, వర్సిటీలతో ఉన్నత విద్యా మండలి సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఛాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టంకు సంబంధించిన విద్యార్థులు, లెక్చరర్లకు అవగాహన కల్పించాలన్నారు. కాగా, మే 1న నిర్వహించనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) హాల్‌టికెట్ల జారీని టెట్ కమిటీ శుక్రవారం నుంచి మళ్లీ ప్రారంభించింది. పరీక్షల నిర్వహణకు ప్రైవేటు యాజమాన్యాలు సహకరించేందుకు అంగీకరించడంతో ఈ మేరకు చర్యలు చేపట్టింది.