ఇంటి తాళాలు పగలగొట్టి చోరీ | Valuable gold chain robbered from house in jubliee hills | Sakshi
Sakshi News home page

ఇంటి తాళాలు పగలగొట్టి చోరీ

Published Wed, Apr 20 2016 7:36 PM | Last Updated on Sun, Sep 3 2017 10:21 PM

Valuable gold chain robbered from house in jubliee hills

జూబ్లీహిల్స్: ఇంటి తాళాలు పగలగొట్టి బెడ్‌రూమ్‌లోని అల్మారాలో నుంచి ఖరీదైన ఆభరణాలు తస్కరించిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఫిలింనగర్ షేక్‌పేట నాలా సమీపంలో ఉన్న ఆదిత్య హిల్‌టాప్ అపార్ట్‌మెంట్స్‌లో పురుషోత్తంరెడ్డి అనే వ్యాపారి నివసిస్తున్నాడు. పనుల నిమిత్తం కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లారు.

వచ్చి చూసేసరికి అల్మారాలో ఉన్న ఖరీదైన రుద్రాక్ష గొలుసుతో పాటు బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఈ మేరకు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ పోలీసులు ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. క్లూస్‌టీమ్, డాగ్‌స్క్వాడ్‌తో ఘటనపై విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement