వేధింపులు తాళలేక... | Wife killed by killing her husband | Sakshi
Sakshi News home page

వేధింపులు తాళలేక...

Published Mon, Aug 14 2017 4:45 AM | Last Updated on Mon, Jul 30 2018 9:21 PM

Wife killed by killing her husband

భర్తను రోకలిబండతో కొట్టి చంపిన భార్య

హైదరాబాద్‌: భర్త వేధింపులు భరించలేక ఓ మహిళ రోకలిబండతో కొట్టడంతో భర్త అక్కడికక్కడే మృతిచెందాడు. హైదరాబాద్‌ జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కాప్రా సాయిబాబానగర్‌లో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలను సీఐ ఉమామహేశ్వరరావు ఆదివారం మీడియాకు వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన హనుమదాసు(40), రోజమ్మ దంపతులకు ముగ్గురు సంతానం.

బతుకుదెరువు కోసం వలసవచ్చి కాప్రా సాయిబాబానగర్‌లో నివాసముంటున్నారు. హనుమదాసు ప్రతీ రోజు మద్యం సేవించి రోజమ్మను వేధించడంతోపాటు కొట్టేవాడు. పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఆమె ఏమీ అనకుండా కుటుంబాన్ని వెళ్లదీసేది. శనివారం రాత్రి హనుమదాసు అతిగా మద్యం సేవించి రోజమ్మపై దాడికి యత్నించాడు. ఈ క్రమంలో రోజమ్మ.. హనుమదాసు తలపై రోకలితో బాదడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, రోజమ్మను అదుపులోకి తీసుకున్నారు.  H

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement