ఇస్లామాబాద్(పాకిస్తాన్): పడవ బోల్తా పడటంతో 15 మంది చనిపోయారు. ఈ సంఘటన పాకిస్థాన్‌లోని సింధ్ రాష్ర్టం తాట్ట జిలాల్లో గురువారం చోటుచేసుకుంది. 50 మంది యాత్రికులతో ఓ బోటు చిన్న దీవికి బయలుదేరుతుండగా బలమైన గాలులు వీయడంతో తిరగబడిందని డిప్యూటీ కమిషనర్ మిర్జా నజీర్ బేగ్ మీడియాకు చెప్పారు. బోటులో సామర్ధ్యానికి మించి ప్రయాణించడం, సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.
అలాగే ఈ ఘటనలో ఇప్పటి వరకు 20 మందిని రక్షించినట్లు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. ఈ ఘటనపై సింధ్ ముఖ్యమంత్రి సయేద్ మురాద్ అలీ షా పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment