ఆన్ లైన్ షాపింగ్‌లో చైనీయులు టాప్‌ | Chinese top in online shopping | Sakshi
Sakshi News home page

ఆన్ లైన్ షాపింగ్‌లో చైనీయులు టాప్‌

Published Tue, Feb 14 2017 1:54 AM | Last Updated on Tue, Sep 5 2017 3:37 AM

ఆన్ లైన్ షాపింగ్‌లో చైనీయులు టాప్‌

ఆన్ లైన్ షాపింగ్‌లో చైనీయులు టాప్‌

బీజింగ్‌: ఆన్ లైన్ షాపింగ్‌లో చైనీయులదే అగ్రస్థానమని ఓ సర్వేలో వెల్లడైంది. ఉత్తర అమెరికా, ఆసియా–పసిఫిక్, యూరప్‌లోని 26 మార్కెట్ల నుంచి సేకరించిన గణాంకాలను విశ్లేషించి బ్రస్సెల్స్‌కు చెందిన ‘ఇంటర్నేషనల్‌ పోస్ట్‌ కార్పోరేషన్ ’ సంస్థ నిర్వహించిన రెండో వార్షిక సర్వేలో ఈ విషయం తేలింది.

సర్వే ప్రకారం.. 36శాతం మంది చైనీయులు కనీసం వారానికి ఒకసారైనా ఆన్ లైన్  షాపింగ్‌ చేస్తారు. అమెరికాలో ఈ కొనుగోళ్లు 16శాతం కాగా, జర్మనీ, బ్రిటన్ లో 15శాతంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ , ఈబే, అలీబాబా గ్రూప్‌ల నుంచి కొనేందుకు ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement