ఇటీవల కెనడా ప్రభుత్వం అరెస్ట్ చేసిన హువావే సీఎఫ్‌వో మెంగ్ వాంఝూకు జైలు శిక్ష భారీగానే పడే అవకాశం ఉందట. ఆంక్షలు ఎదుర్కొంటున్న ఇరాన్‌తో వ్యాపార లావాదేవీలు కొనసాగించడం ద్వారా అమెరికా వాణిజ్య నిబంధనలను ఉల్లంఘించిందన్న ఆరోపణలపై ఆమెకు గరిష్టంగా 30 సంవత్సరాల జైలు శిక్ష పడొచ్చని టెక్ క్రంచ్ రిపోర్ట్ చేసింది.
హువాయ్ వ్యవస్థాపకుడు రెన్ జెంగ్‌ఫేకుమార్తె అయిన మెంగ్, సంస్థ అనుబంధ సంస్థ స్కై క్యామ్ ఇరాన్‌లో వ్యాపారం చేయడానికి అనుమతినిచ్చింది, తద్వారా అమెరికా ఆంక్షలు ఉల్లంఘించిందనీ టెక్‌క్రంచ్ నివేదించింది. హువావేతో దేశ భద్రతకు ముప్పు ఉందని భావిస్తున్న అమెరికా , ఇప్పటికే ఇరాన్ మీద ఆంక్షలను ఉల్లంఘిస్తున్న అంశంపై హువావే మీద విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలో తమ దేశ భద్రతకు ముప్పు తెచ్చి పెట్టేలా చైనా ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలపై హువావేకు అనేక హెచ్చరికలను కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో కెనడా కోర్టు అనుమతితో అమెరికాకు తరలిస్తే ఈ కేసులో మెంగ్‌కు కనీసం 30సంవత్సరాల కారాగార శిక్ష తప్పదని వ్యాఖ్యానించింది.
చైనా టెలికం దిగ్గజం హువావే వ్యవస్థాపకుడు కుమార్తె, సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో) మెంగ్ వాంఝూను కెనడా ప్రభుత్వం డిసెంబర్ 1వ తేదీన అరెస్ట్ చేసింది. దీనిపై స్పందించిన విదేశీ వ్యవహారాల చైనీస్ మంత్రిత్వ శాఖ మెంగ్ విడుదలకు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment