ఆ సూచీలో మనం అట్టడుగున...
Published Wed, Sep 13 2017 5:09 PM | Last Updated on Tue, Sep 19 2017 4:30 PM
సాక్షి,న్యూఢిల్లీః అంతర్జాతీయ మానవ పెట్టుబడి సూచీలో భారత్ 103వ ర్యాంక్‌తో సరిపెట్టుకుంది. ఈ సూచీలో నార్వే ముందువరసలో నిలిచింది. ఉపాథి విషయంలో లింగ వ్యత్యాసం విభాగంలో భారత్ అట్టడుగున ఉంది. అయితే భవిష్యత్ అవసరాలకు అవసరమైన నైపుణాల్యను సంతరించుకునే విషయంలో భారత్ 130 దేశాల్లో 65వ స్ధానంతో మెరుగైన ర్యాంక్ సాధించింది. జెనీవాకు చెందిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఈ జాబితాను రూపొందించింది. ప్రజల విజ్ఞానం, నైపుణ్యాల ఆధారంగా దేశాల మానవ పెట్టుబడి సూచీని వెల్లడించింది. గత ఏడాది ఈ జాబితాలో భారత్ 105వ స్ధానంలో నిలవగా, ఫిన్‌లాండ్ టాప్ పొజిషన్ సాధించింది.
బ్రిక్స్ దేశాల కంటే భారత్ తక్కువ ర్యాంక్ సాధించినట్టు వరల్డ్ ఎకనమిక్ పోరం తెలిపింది. బ్రిక్స్ దేశాల్లో రష్యా 16వ ర్యాంక్ సాధించగా, చైనా 34, బ్రెజిల్ 77, దక్షిణాఫ్రికా 87వ ర్యాంక్ సాధించాయి. ఇక దక్షిణాసియా దేశాల్లోనూ శ్రీలంక, నేపాల్ కంటే తక్కువ ర్యాంక్‌నూ, పాకిస్తాన్ కంటే కొద్దిగా మెరుగైన ర్యాంక్‌నూ భారత్ సాధించింది.
జాబితాలో నార్వే తొలిస్ధానంలో నిలవగా తర్వాతి స్ధానాల్లో వరుసగా ఫిన్‌లాండ్, స్విట్జర్లాండ్‌లున్నాయి. టాప్‌టెన్‌లో అమెరికా, డెన్మార్క్, జర్మనీ, న్యూజిలాండ్, స్వీడన్, స్లొవేనియా, ఆస్ట్రియాలు నిలిచాయి.
Advertisement