భూగోళమంతా అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియను ఆసక్తిగా గమనిస్తున్నవేళ.. పీఠం కోసం పోటీపడుతున్న ప్రత్యర్థులిద్దరూ కలిసిపోయారనే వార్తలు ఇంటర్నెట్ లో కొద్దిసేపు కలకలం రేపాయి. 'ఎత్తుకుపై ఎత్తులతో ప్రచారంలో దూసుకుపోతున్న వైరిపక్షాలు కలవడమేంటి? ఇది అసంభవం!' అని కొందరు, 'అసలు విషమేంటి?' అని మరికొందరు ఆ వార్తలను ఆసక్తిగా చదివారట. తీరా అవి ఫేక్ వార్తలని, హాస్యం కోసం ఫొటోల్ని మార్ఫింగ్ చేశారని తెలిశాక నవ్వుకున్నారు.
ప్రపంచంలోని అన్ని సంఘటనలు, వాటిపై వచ్చే వార్తలకు పేరడీలను సృష్టించే వెర్రి నెటిజన్లు కొందరు.. ఆయా రంగాల్లో ప్రత్యర్థులుగా పోటీపడుతోన్న రాజకీయనాయకులు, సంగీతకారిణులు, క్రీడాకారుల ఫోటోలను ఎడిటింగ్ సాఫ్ట్ వేర్ తో మార్ఫ్ చేసి నెట్ లో 'వీళ్లెవరో కనిపెట్టండి చూద్దాం' అని సవాలు విసిరారు. రోజుకు వందలసార్లు కనిపించేవాళ్ల 'ఫేస్ ఆఫ్' అయినంత మాత్రాన గుర్తుపట్టలేమా' అంటూ ఠక్కున ఫొటోల్లోఉన్నవాళ్ల పేర్లు చెప్పేస్తున్నారు చాలామంది. మీరూ ట్రై చేస్తారా?
ట్రంప్, హిల్లరీ
లేబర్ పార్టీ నేత టోనీ బ్లేయర్, అదేపార్టీకి చెందిన మరో నాయకుడు, ప్రస్తుత ప్రతిపక్ష నేత జెర్మి కొర్బెయిన్
పాప్ గాయణీమణులు మడోనా, లూరీ బ్లూ