చిలీలో భూకంపం, రిక్టర్ స్కేలుపై 6.8గా తీవ్రత నమోదు
చిలీలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైంది. శనివారం తెల్లవారుజామున ఈ భూకంపం వచ్చింది గానీ, దీనివల్ల సునామీ ముప్పు ఏమీ లేదని నేవీ అధికారులు చెబుతున్నారు. భూకంపం కేంద్రం చిలీలోని కోక్వింబో నగరానికి దక్షిణంగా 100 కిలోమీటర్ల దూరంలో ఉందని అమెరికా వాతావరణ కేంద్రం తెలిపింది.
భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో ఈ భూకంపం వచ్చింది. సమీపంలోని తీరప్రాంతాల్లో చిన్నపాటి సునామీ రావొచ్చని చిలీ నౌకాదళ అధికారులు హెచ్చరిక జారీచేసినా, తర్వాత దాన్ని ఉపసంహరించుకున్నారు. ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగినట్లు సోషల్ మీడియాలో వినవచ్చింది.