అవును.. నా బిడ్డ హైదరాబాద్‌ వస్తోంది! | My daughter will attend meeting in Hyderabad, says Donald Trump | Sakshi
Sakshi News home page

అవును.. నా బిడ్డ హైదరాబాద్‌ వస్తోంది!

Published Sat, Aug 12 2017 2:24 AM | Last Updated on Tue, Sep 4 2018 5:29 PM

అవును.. నా బిడ్డ హైదరాబాద్‌ వస్తోంది! - Sakshi

అవును.. నా బిడ్డ హైదరాబాద్‌ వస్తోంది!

వాషింగ్టన్‌: హైదరాబాద్‌లో నవంబర్‌ 28 నుంచి జరగబోయే అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సుకు తన కూతురు ఇవాంకా హాజరవుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. ‘‘అమెరికా ప్రతినిధుల బృందానికి ఇవాంకా ట్రంప్‌ నేతృత్వం వహిస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా మహిళా పారిశ్రామికవేత్తల ప్రాతినిధ్యానికి సంకేతంగా ఉంటుంది’’ అని ఆయన ట్విటర్‌లో తెలిపారు.

ఈ సదస్సుకు ఇవాంకా హాజరవుతున్నట్టు గురువారం ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్‌లో ప్రకటించిన కొద్దిగంటలకే ట్రంప్‌ ఈ మేరకు స్పందించారు. అమెరికా ప్రతినిధుల బృందానికి నేతృత్వం వహించడం, ప్రధాని మోదీని కలుసుకోబోతుండడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు ఇవాంకా కూడా మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. 35 ఏళ్ల ఇవాంకా తన తండ్రికి సలహాదారుగా ఉన్నారు. మహిళలు, చిన్నారులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement