జస్ట్‌ మిస్‌.. ప్రాణాలతో బయటపడ్డ మహిళ | Woman Runs Across Wobbly Bridge. Seconds Later, It Is Swept Away | Sakshi
Sakshi News home page

జస్ట్‌ మిస్‌.. ప్రాణాలతో బయటపడ్డ మహిళ

Published Fri, Aug 18 2017 11:59 AM | Last Updated on Sun, Sep 17 2017 5:40 PM

జస్ట్‌ మిస్‌.. ప్రాణాలతో బయటపడ్డ మహిళ

జస్ట్‌ మిస్‌.. ప్రాణాలతో బయటపడ్డ మహిళ

బీజింగ్‌: భూమి మీద నూకలు బాకీ ఉంటే ఎంతటి ప్రమాదం నుంచైనా తప్పించుకోవచ్చంటారు మన పెద్దలు. అలాంటి సంఘటనే ఎదురైంది ఓ చైనా మహిళకు.. దాదాపు చావు చివరి అంచువరకు వెళ్లి ప్రాణాలతో గట్టెక్కింది.. ఈ చైనా లేడీ.  గత కొద్దీ రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు దక్షిణ చైనాలోని నదులు ఉప్పొంగుతున్నాయి.
 
ఓ నదిపై ఉన్న  కర్రల వంతెనను ఆ మహిళ దాటుతుండగా నది ప్రవాహం ఒక్కసారిగా ఉదృతమైంది. ఇది గమనించిన ఆ మహిళ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పరుగు లంకించుకుంది. వంతెన చివరి భాగం చేరేలోపే బ్రిడ్జి కొట్టుకుపోయింది. నిమిషం తేడాలో ప్రమాదం నుంచి బయటపడింది. నాటకీయంగా చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. 
Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement