ముంబై : ప్రస్తుతం బాలీవుడ్‌లో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఆటగాళ్లు, నటులు, స్పూర్తిదాయక వ్యక్తుల జీవిత చరిత్ర ఆధారంగా చాలా సినిమాలు తెరకెక్కాయి. ఇప్పుడు ఓషోగా సుపరిచితులైన ఆధ్మాత్మిక గురువు భగవాన్ రజనీశ్ జీవితాన్ని తెరపై ఆవిష్కరించేందుకు కరణ్ సన్నద్ధమైనట్లు.. ఓషోగా రణ్‌వీర్ సింగ్ నటించనున్నట్లు వదంతులు ప్రచారం అయ్యాయి. కానీ అది కార్యరూపం దాల్చలేదు.
అయితే ఒక అంతర్జాతీయ చానెల్ ఓషో జీవిత చరిత్రను వెబ్ సిరీస్ రూపంలో ప్రేక్షకులకు అందించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇందుకోసం రచయిత శకున్ బత్రా స్క్రిప్ట్ కూడా సిద్ధం చేస్తున్నారట. ఈ విషయం తెలుసుకున్న మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి కనబరిచారన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాదు లాస్ ఏంజెల్స్ వెళ్లి మరీ చానెల్ ప్రతినిధులను కలిసేందుకు సుముఖంగా ఉన్నారట ఆమిర్. ఇదే గనుక నిజమైతే మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ లిస్టులో మరో విలక్షణ పాత్ర చేరడంతో పాటు.. వెబ్ సిరీస్‌లో ఆమిర్‌ను చూసి అభిమానులు కూడా కొత్త అనుభూతి పొందవచ్చు. పలు వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్న ఓషో 1990లో మరణించారు.
వైల్డ్ వైల్డ్ కంట్రీ పేరుతో ‘ద నెట్‌ఫ్లిక్స్’ ఓషో జీవితం ఆధారంగా రూపొందించిన డాక్యుమెంటరీ సిరీస్ సూపర్ హిట్ అయ్యింది. దీంతో బీ- టౌన్‌లో కూడా పలువురు ఈ సిరీస్ గురించి చర్చిస్తున్నారు.
అలియా కూడా..!
శకున్ సినిమా కపూర్ అండ్ సన్స్‌లో నటించిన అలియా భట్ కూడా ఈ ప్రాజెక్ట్ పట్ల ఆసక్తిగా ఉందట. అయితే ఇందులో తాను నటిస్తుందో లేదో తెలియదు గానీ ఇది ఒక గొప్ప ప్రాజెక్ట్ అని అలియా చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment