అమాయక పాత్రలతో... | Amayaka Pandavulu Audio Launched | Sakshi
Sakshi News home page

అమాయక పాత్రలతో...

Published Sat, Jan 3 2015 11:47 PM | Last Updated on Sat, Sep 2 2017 7:10 PM

అమాయక పాత్రలతో...

అమాయక పాత్రలతో...

 విశ్వనాథ్‌రెడ్డి, వెన్నెల జంటగా టి. రాము దర్శకత్వంలో భక్త మార్కండేయ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న చిత్రం ‘అమాయక పాండవులు’. అర్జున్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను, ప్రచార చిత్రాన్ని ముఖ్య అతిథి తుమ్మలపల్లి రామసత్యనారాయణ విడుదల చేశారు. మరో అతిథి దర్శకుడు సాయి వెంకట్ చిత్రబృందానికి శుభాకాంక్షలందజేశారు. అనంతరం హీరో, నిర్మాత విశ్వనాథ్‌రెడ్డి మాట్లాడుతూ -‘‘ఈ కథ నచ్చడంతో హీరోగా నటించడంతో పాటు, నిర్మిస్తున్నాను. కథ చాలా వినూత్నంగా ఉంది. మార్చి లేదా ఏప్రిల్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఇందులో విశ్వనాథ్ శక్తిమంతమైన పోలీస్ అధికారిగా నటించారని దర్శకుడు తెలిపారు. మంచి పాటలివ్వడానికి ఆస్కారం ఉన్న కథ ఇదని అర్జున్ చెప్పారు.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement