![Tummalapalli Rama Satyanarayana interview about shiva 143 - Sakshi](/styles/webp/s3/article_images/2019/09/10/PHOTO-2019-09-09-16-54-11.jpg.webp?itok=1WEzZQGI)
‘శివ 143’లో రామసత్యనారాయణ
‘‘సినిమా రంగంపై మక్కువతో 2004లో ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. దాదాపు 97 చిత్రాలు నిర్మించిన నేను 98వ సినిమాగా ‘శివ 143’ నిర్మించాను. 99వ సినిమాని అతి త్వరలో నాకు చాలా ఇష్టమైన, వివాదాస్పద దర్శకునితో ప్లాన్ చేస్తున్నా. కథ రెడీ అవుతోంది’’ అని నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ అన్నారు. నేడు ఆయన పుట్టినరోజుని పురస్కరించుకుని మాట్లాడుతూ– ‘‘నటుడిగా లక్ష్మీనరసింహ, ఘంటసాల గారి బయోపిక్ లాంటి సినిమాలతో పాటు సుమారు 75 చిత్రాల్లో మంచి పాత్రల్లో నటించా. ‘శివ 143’ సినిమాలో రాష్ట్రపతి పాత్ర చేశాను. త్వరలో ఆ సినిమా విడుదల కానుంది.
నేను నిర్మించనున్న 100వ చిత్రానికి దర్శకత్వం చేస్తానని శతాధిక చిత్రాల దర్శకుడు మాట ఇచ్చారు. ఆ అగ్ర దర్శకుడి పిలుపుకోసం ఎదురు చూస్తున్నా. నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండటానికి కారణం నిర్మాత కళ్యాణ్‌గారి ఆశీస్సులు, డైరెక్టర్ కోడి రామకృష్ణగారి పరిచయమే. దాసరి నారాయణరావుగారి పరిచయం, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్యగారి సహకారం మరువలేనిది. నన్ను ఇష్టపడే దర్శకుడు వీవీ వినాయక్‌గారు, నాకు చాలా ఇష్టమైన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మగారు. వారందరి సహకారం వల్లే 98 సినిమాలు తీసి, ఈ స్థాయిలో ఉన్నా. ఇందుకు వారందరికీ కృతజ్ఞతలు’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment