బాహుబలి 1500 కోట్లు | bahubali-2 enter to 1500 crore club | Sakshi
Sakshi News home page

బాహుబలి 1500 కోట్లు

Published Fri, May 19 2017 11:49 PM | Last Updated on Sun, Jul 14 2019 4:05 PM

బాహుబలి 1500 కోట్లు - Sakshi

బాహుబలి 1500 కోట్లు

కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలని చెబుతుంటారుగా! ‘బాహుబలి–2’తో అచ్చం అలాగే ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ బాక్సాఫీస్‌ కుంభస్థలాన్ని కొట్టారు ప్రభాస్‌ అండ్‌ కో. రాజమౌళి దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మించిన ఈ సినిమాలో హీరో ఇంట్రడక్షన్‌ సీన్‌లో ప్రభాస్‌ ఏనుగు కుంభస్థలం ఎక్కుతారు.

అంతే రాజసంగా అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాగా ‘బాహుబలి–2’ బాక్సాఫీస్‌ అంబారి కుంభస్థలం ఎక్కింది. ఇప్పటివరకు రూ. 1500 కోట్లు కలెక్ట్‌ చేసిందీ సినిమా! ఈ విషయాన్ని చిత్రనిర్మాణ సంస్థ ఆర్కా మీడియాకు చెందిన ‘బాహుబలి’ మూవీ ట్విట్టర్‌ ఖాతాలో అధికారికంగా వెల్లడించారు. ఇంకా పలు థియేటర్లలో సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement