!['సౌత్' పాట అందుకున్న హీరోయిన్ - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/81431797178_625x300_0.jpg.webp?itok=tI_g6qmK)
'సౌత్' పాట అందుకున్న హీరోయిన్
న్యూఢిల్లీ: బాలీవుడ్ లో అదృష్టం కలిసిరాకపోవడంతో 'మిల్కీ బ్యూటీ' తమన్నా మళ్లీ 'సౌత్' పాట అందుకుంది. గతానుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్నానని ఇక నుంచి దక్షిణాదిపైనే దృష్టి పెడతానని వెల్లడించింది. సౌత్ లో అగ్ర తారగా కొనసాగిన తమన్నా బాలీవుడ్ లో నటించిన హిమ్మత్ వాలా, హమ్ షాకాల్స్ సినిమాలు ప్లాప్ అయ్యాయి. దీంతో ఆమె మళ్లీ దక్షిణాది సినిమాలపై దృష్టి సారించింది. ప్రతిష్టాత్మక చిత్రం 'బాహుబలి'లో ఆమె కీలకపాత్ర పోషించింది. ఈ సినిమాను హిందీలో కరణ్ జోహార్ విడుదల చేస్తున్నారు.
తన చేతిలో ఉన్న తెలుగు, తమిళ సినిమాలతో సంతోషంగా ఉన్నానని తమన్నా తెలిపింది. ఇకపై బాలీవుడ్ కు ప్రాధాన్యత ఇవ్వబోనని స్పష్టం చేసింది. 'బాహుబలి'లో తన పాత్రను కరణ్ జోహార్ ఎంతో మెచ్చుకున్నారని పొంగిపోయింది. జూలై 10న విడుదలకానున్న 'బాహుబలి' విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు చెప్పింది.