అపజయాలు ఎదురైనా నిలబడ్డా!
ఒక్క విజయంతో అవకాశాలు ముంగిట వాలతాయనుకోవడం భ్రమ. అపజయాలెదురైనా నిలబడ్డాను. అందుకు నా ప్రతిభే కారణం అంటున్నారు నటి తమన్నా భాటియా. ఆమె ప్రస్తుతం తమిళం, తెలుగు భాషల్లో ప్రముఖ కథానాయికగా వెలుగొందుతున్నారన్న సంగతి తెలిసిందే. అయితే తమన్నా కింతటి స్థాయి అంత ఈజీగా రాలేదు. పలు అపజయాల తరువాత నిరంతర కృషి, పట్టుదల,శ్రమ అన్నింటికీ మించి ప్రతిభతోనే ఈ స్థాయికి చేరుకున్నానన్నది ఆమె అంచెలంచెలమైన నమ్మకం.
ద్విభాషా చిత్రాలు ఆ మధ్య విజయదుందుమీ మోగించిన బాహుబలి, శుక్రవారం తెరపైకి వచ్చిన తోళా విజయాలు నటిగా తమన్నా స్థాయిని మరింత పెంచాయని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి ఉండదు. ఈ సందర్భంగా ఈ ఉత్తరాది బ్యూటీ తన మనసులోని భావాలను కింది విధంగా వ్యక్తం చేశారు. నేను అపజయాలు ఎదురైనా నిలదొక్కుకుని ఎదిగాను. చాలా మంది ఒక్క విజయం అందుకుంటే చాలా పరిశ్రమ ప్రముఖుల దృష్టిలో పడిపోతాం,ఆ తరువాత అవకాశాలు వాటంతట అవే వచ్చి పడిపోతాయనే భ్రమలో ఉంటారు.
అలాంటి భావనే తప్పు. ఒక్క చిత్రం విజయం సాధించి నంత మాత్రాన అవకాశాలు రావు. ఎవరూ నెత్తికెక్కించుకోరు. ఆ తరువాత కూడా వాటి కోసం పోరాడాలి. ఒక్క విజయం పొందిన తదుపరి అవకాశాలు లేక సతమతం అవుతున్న వారు చాలా మంది ఉన్నారు. అందువల్ల నేను చెప్పేదేమిటంటే దేనికైనా ప్రతిభే కొలమానం.అది ఉంటేనే అవకాశాలు వస్తాయి.తద్వారా విజయాలూ వరిస్తాయి.
తొలి రోజుల్లో నా చిత్రాలు సరిగా ఆడలేదు. ఆ తరువాత ఒక్క చిత్రం విజయం సాధించింది. ఆ విజయంతోనే నాకు అవకాశాలు రాలేదు. హ్యాపీ డేస్ అనే తెలుగు చిత్రం మంచి విజయం సాధించింది.దాని తరువాత చాలా చిత్రాలు నిరాశ పరిచాయి.అయినా నటిగా నేనిప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే ప్రతిభే కారణం. నా చిత్రాలు ఆశించిన విజయాలు సాధించక పోయినా నాలోని ప్రతిభను చిత్ర పరిశ్రమ గుర్తించింది. అందుకే అవకాశాలు వస్తున్నాయి.చిత్ర జయాపజయాల గురించి చింతించాల్సిన అవసరం లేదు. మనలోని ప్రతిభే ఉన్నత స్థాయిలో నెలబెడుతుంది.