ముంబై : వైవిధ్య చిత్రాలను ఎంచుకుంటూ అభిమానులను అలరిస్తున్న బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తాజాగా రామమందిరం-బాబ్రీ మసీదు అంశాన్ని బేస్ చేసుకుని ఓ మూవీని నిర్మించేందుకు సన్నద్ధమయ్యారు. విజయేంద్రప్రసాద్ స్ర్కిప్ట్ సమకూరుస్తుండగా అపరాజిత అయోధ్య పేరిట వచ్చే ఏడాది ఆరంభంలో మెగాఫోన్ పట్టేందుకు కంగనా సంసిద్ధమయ్యారని ముంబై మిర్రర్ పేర్కొంది. మరోవైపు కంగనా నిర్మాతగా మారుతున్నారని ఆమె సోదరి రంగోలి చందేల్ ట్వీట్ చేశారు.
కంగనా అతిత్వరలోనే అపరాజిత అయోధ్యగా రానున్నారని, దర్శకులు, నటీనటుల గురించి ప్రకటన చేస్తారని పేర్కొన్నారు. అపరాజిత అయోధ్య వైవిధ్యమైన చిత్రమని, నిర్మాణ రంగంలో అడుగుపెట్టేందుకు ఇది సరైన ఆరంభమని కంగనా చెప్పుకొచ్చారు. కంగనా చివరిసారిగా రాజ్‌కుమార్ రావుతో ఏక్తాకపూర్ నిర్మించిన జడ్జిమెంటల్ హై క్యా మూవీతో ప్రేక్షకులను పలకరించారు. మరోవైపు జయలలిత బయోపిక్ తలైవిలో ఆమె నటిస్తున్నారు. తలైవిగా కంగనా ఫస్ట్‌లుక్ ఇటీవల విడుదలై అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment