'సినిమాలపై ఇప్పుడు ఆసక్తిలేదు' | Not interested in films: Meenakshi Seshadri | Sakshi
Sakshi News home page

'సినిమాలపై ఇప్పుడు ఆసక్తిలేదు'

Published Mon, Jun 29 2015 8:00 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

'సినిమాలపై ఇప్పుడు ఆసక్తిలేదు' - Sakshi

'సినిమాలపై ఇప్పుడు ఆసక్తిలేదు'

ముంబై:  మీనాక్షి శేషాద్రి.. బాలీవుడ్తో పాటు దక్షిణాది భాషా చిత్రాల అభిమానులకు సుపరిచయం. మీనాక్షి ఒకప్పుడు బాలీవుడ్లో అగ్రతారగా వెలుగొందారు. అందం, అభినయం, నృత్యంతో ఆకట్టుకున్నారు. అయితే చాలా రోజులుగా ఆమె సినిమాలకు దూరమయ్యారు. మళ్లీ బాలీవుడ్ రంగంవైపు మీనాక్షి రానున్నారని వార్తలు వచ్చినా, అవి నిజంకాదని చెప్పారు. ప్రస్తుతం సినిమాల్లో నటించడం పట్ల తనకు ఆసక్తి లేదని మీనాక్షి శేషాద్రి స్పష్టం చేశారు. 1990లో విజయవంతమైన చిత్రం 'ఘాయల్' సీక్వెల్లో తాను నటించడం లేదని చెప్పారు.

'ప్రస్తుతం సినిమాలపై నాకు ఆసక్తి లేదు. సినిమాల కంటే నా పిల్లలు, కుటుంబమే ముఖ్యం. అందుకే చాలా రోజులుగా సినిమాలకు దూరమయ్యా. స్టేజి, నాట్య ప్రదర్శనలు మాత్రం చేస్తాను. పిల్లలు డిగ్రీ పూర్తి చేశాక సినిమాలు గురించి ఆలోచిస్తానేమో' అని మీనాక్షి అన్నారు. మీనాక్షి వివాహం చేసుకున్న తర్వాత అమెరికాలో స్థిరపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement