![హాలీవుడ్‌లో ‘పంజా’ హీరోయిన్ - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/81390592095_625x300.jpg.webp?itok=K3KDbRzG)
హాలీవుడ్‌లో ‘పంజా’ హీరోయిన్
పవన్ కల్యాణ్‌తో ‘పంజా’ సినిమాలో ఆడిపాడిన సారాజేన్ డయాస్ గుర్తుంది కదూ! మాజీ మిస్ ఇండియా అయిన ఈ బ్యూటీకి ఎందుకనో తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. హిందీలో మూడు సినిమాలు చేసినా అంతగా గుర్తింపు రాలేదు. అయితే తాజాగా ఆమె ఓ గోల్డెన్ చాన్సు కొట్టేసింది. ‘యాంగ్రీ ఇండియన్ గాడెస్’ అనే హాలీవుడ్ చిత్రంలో ఆమె నాయికగా చేస్తోంది. భారతీయ పోకడలను ప్రతిబింబించే ఈ సినిమాకు పాన్ నలిన్ దర్శకుడు.
సారాజేన్‌తో పాటు మరో ఇద్దరు భారతీయ తారలు సంధ్య మృదుల, అనుష్క మన్‌చందా ఇందులో నటిస్తున్నారు. ఈ సినిమా అయినా తన కెరీర్‌ని మలుపు తిప్పుతుందనే ఆశాభావంతో ఉన్నారు సారాజేన్.