‘నిజంగా ఇది మీరేనా.. గుర్తుపట్టలేకపోతున్నాం’ | Ram Kapoor New Lean Look Fans Says Inspirational | Sakshi
Sakshi News home page

అస్సలు బాగాలేరు... కానీ ఆరోగ్యం ముఖ్యం కదా!

Published Tue, Jul 9 2019 2:27 PM | Last Updated on Tue, Jul 9 2019 2:27 PM

Ram Kapoor New Lean Look Fans Says Inspirational - Sakshi

నేటి ఆధునిక జీవనశైలిలో దాదాపుగా ప్రతీ ఒక్కరిని వేధిస్తున్న ప్రధాన సమస్య స్థూలకాయం. అధిక బరువును తగ్గించుకునేందుకు ఒక్కొక్కరూ గంటల తరబడి వ్యాయామం చేస్తుంటారు. ఊబకాయం నుంచి విముక్తి పొందేందుకు విశ్వప్రయత్నాలు చేసి.. స్లిమ్‌గా తయారవుతారు. టీవీ నటుడు రామ్‌ కపూర్‌ కూడా ఈ కోవకు చెందిన వారే. స్క్రీన్‌పై భారీకాయంతో కనిపించే రామ్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఫొటో అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

చాలా కాలం తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్స్‌ను పలకరించిన రామ్‌ కపూర్‌... స్లిమ్‌గా ఉన్న తన ఫొటోను షేర్‌ చేసి అభిమానులకు స్వీట్‌ షాకిచ్చాడు. ఈ క్రమంలో రామ్‌ న్యూలుక్‌కు ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. ‘ ఇంతలా మారిపోయారేంటి సార్‌. అస్సలు గుర్తుపట్టలేకపోతున్నాం. ఏమాటకి ఆ మాటే గానీ... నిజానికి మీరు బొద్దుగా ఉంటేనే బాగుంటారు. అయితే అందంతో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యమే కదా. ఇలాంటి గొప్ప మార్పుతో ఎక్కువ మందిని ఇన్‌స్పైర్‌ చేయగలరు’ అంటూ అతడిని ప్రశంసిస్తున్నారు. మరికొంత మంది మాత్రం..‘  ఇది నిజమా. మొత్తంగా మారిపోయారే. అసలు ఈ అకౌంట్‌ ఎవరిదో ముందు చెక్‌చేయాలి’ అంటూ సరదాగా కామెంట్‌ చేస్తున్నారు. కాగా పలు హిట్‌ సీరియళ్లలో నటించిన రామ్‌ కపూర్‌ కార్తిక్‌ కాలింగ్‌ కార్తిక్‌, స్టూడెంట్‌ ఆఫ్‌ ద ఇయర్‌, లవ్‌యాత్రి, షాదీ కీ సైడ్‌ ఎఫెక్ట్ప్‌ వంటి బాలీవుడ్‌ సినిమాల్లో కనిపించాడు.

Wassssup peeps!! Long time no see

A post shared by Ram Kapoor (@iamramkapoor) on

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement