అప్పుడు లక్ష్మణుడు... ఇప్పుడు ప్రతినాయకుడు?
ఈతరం ప్రేక్షకులకు శ్రీకాంత్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుసు. కానీ, ఆయన తెలుగు తెరకు పరిచయమైంది విలన్‌గానే. కెరీర్ స్టార్టింగ్‌లో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ చేసిన శ్రీకాంత్, తర్వాత హీరోగా టర్న్ తీసుకుని సక్సెస్‌లు అందుకున్నారు. ఇటీవల క్యారెక్టర్ ఆర్టిస్టుగా టర్న్ తీసుకున్న ఆయన మళ్లీ విలన్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
బాలకృష్ణ హీరోగా కేయస్ రవికుమార్ దర్శకత్వంలో సి. కల్యాణ్ నిర్మించనున్న సినిమాలో శ్రీకాంత్ విలన్‌గా నటించనున్నారని టాక్. ఇంతకు ముందు బాలకృష్ణ ‘శ్రీరామరాజ్యం’లో శ్రీకాంత్ లక్ష్మణుడి పాత్రలో నటించారు. అప్పుడు అన్నయ్య శ్రీరాముని అడుగు జాడల్లో నడిచిన తమ్ముడిగా నటిస్తే... ఇప్పుడు హీరోతో ఢీ అంటే ఢీ అనే పాత్రలో కనిపిస్తారన్న మాట. ఇందులో నయనతార హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు సమాచారం.