ప్రముఖ తెలుగు దర్శకుడు, సినీ విమర్శకుడు కేఎన్‌టీ శాస్త్రి కన్నుమూశారు. దర్శకుడిగా, రచయితగా, విమర్శకుడిగా ఆయన పలుమార్లు జాతీయ అవార్డులను అందుకున్నారు. ఆయన తెరకెక్కించిన తిలదానం, సురభి(డాక్యుమెంటరీ) చిత్రాలకు నంది అవార్డు కూడా అందుకున్నారు. తెలుగులోనే కాకుండా కొన్ని కన్నడ చిత్రాలకు కూడా ఆయన పనిచేశారు.
అంతేకాకుండా పలు చలన చిత్రోత్సవాలకు ఆయన జ్యూరీ సభ్యుడిగా పనిచేశారు. 2006లో నందితా దాస్ హీరోయిన్‌గా శాస్త్రి తెరకెక్కించిన కమిలి చిత్రాన్ని దక్షిణ కొరియాలోని బూసాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. ఆయన దర్శకత్వం వహించిన తిలదానం, కమిలి చిత్రాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పెద్ద హీరోలతో బ్లాక్ బస్టర్ సినిమా తీయడం కంటే సందేశాత్మక చిత్రం తీయడానికే మొగ్గు చూపుతానని తెలిపారు. సినీ విమర్శకుడిగా ఆయన పలు పుస్తకాలు కూడా రాశారు.
Comments
Please login to add a commentAdd a comment