అలాంటి పాత్ర దొరికితే బావుంటుంది!
అలాంటి పాత్ర దొరికితే బావుంటుంది!
Published Wed, Apr 2 2014 12:07 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
‘హావభావాలే సరిగ్గా లేవు. ఈ అమ్మాయి హీరోయిన్ ఏంటి?’ అన్న వాళ్లు విస్తుపోయేలా... సూపర్‌స్టార్ అయ్యారు కత్రినా. ‘చిన్నపిల్లలు తప్పటడులు వేసినట్లుగా ఏంటా డాన్సూ...’ అని హేళన చేసిన వారు అవాక్కయ్యేలా సూపర్ డాన్సర్ అని కితాబులందుకున్నారు కత్రినా. ఒకప్పుడు తెగడ్తలెదుర్కున్న ఈ ముద్దుగుమ్మకు ఇప్పుడు ఎక్కడ చూసినా పొగడ్తలే. కత్రినా నాయికగా మారి 13 ఏళ్లు అయ్యింది. ఇప్పటికీ బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ లిస్ట్‌లో ఒకరిగా కొనసాగుతూనే ఉన్నారామె. ఇటీవల ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. దానికి కారణం ఇటీవలి ‘క్వీన్’ సినిమా. అందులో కంగనా రనౌత్ నటన చూసి ఈ ముద్దుగుమ్మ ఫిదా అయిపోయారట. ‘‘స్టార్లు, డాన్సర్లు ఎక్కువ కాలం ప్రజల హృదయాల్లో నిలవలేరు. నటీమణులే జనహృదయాల్లో చిరస్థాయిగా ఉంటారు. ‘క్వీన్’ చూశాక, అలాంటి గొప్ప పాత్ర నాకు రాలేదే అని బాధ కలిగింది. ఎన్ని హిట్ చిత్రాల్లో నటించినా.. నటిగా నాకు తృప్తినిచ్చింది ‘రాజ్‌నీతి’. ‘క్వీన్’ చూశాక, అలాంటి పాత్ర దొరికితే బావుండు అనిపించింది. కంగన నటన అమోఘ’’మని కితాబిచ్చారు కత్రినా.
Advertisement
Advertisement