వచ్చిన ఒక్క ఛాన్స్ పోగొట్టుకున్న హీరోయిన్
న్యూఢిల్లీ: బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ సరసన నటించడం అంటే ఏ హీరోయిన్ మాత్రం ఎగిరి గంతేయకుండా ఉండగలదు.. అసలు అలా ఉండగలుగుతుందా.. కానీ, రాకరాక ఆయనతో కలిసి నటించేందుకు వచ్చిన తొలి అవకాశాన్ని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చేజేతులా చేజార్చుకుంది. ఆమె మిగితా కార్యకలాపాలపై దృష్టి పెట్టడమే ఇందుకు కారణం అయిందని బాలీవుడ్ వర్గాలు చెవి గొరుక్కొంటున్నాయి.
త్వరలోనే ఆనంద్ రాయ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో షారుక్ ఖాన్ నటించనున్నారు. అయితే, తొలుత ఆయన సరసన కంగనా రనౌత్ అనుకున్నారట. కానీ, ఆమె కథ, కాస్ట్యూమ్స్ విషయాల్లో వేలు పెట్టడంతో ఆమె స్థానంలో ప్రస్తుతం కత్రినా కైఫ్ గానీ, దీపికా పదుకొనేను గానీ నటింపజేయాలని దర్శకుడు బావిస్తున్నాడట. అయితే, ఈ సినిమా ఇద్దరు హీరోయిన్ల పాత్ర కూడా ప్రధానమేనని తెలుస్తోంది. సినిమాపై తుది నిర్ణయం వెలువరితే తప్ప అసలు షారుక్ సినిమా పేరు, అందులో నటీమణుల పేర్లు తెలిసేలా లేదు.