లంచం తీసుకున్న14 ఏళ్ల తర్వాత జైలుశిక్ష | 14 years on, IT officer gets jail for graft | Sakshi
Sakshi News home page

లంచం తీసుకున్న14 ఏళ్ల తర్వాత జైలుశిక్ష

Published Tue, May 12 2015 6:35 PM | Last Updated on Thu, Sep 27 2018 4:47 PM

14 years on, IT officer gets jail for graft

ముంబై: లంచం కేసులో 14  ఏళ్ల తర్వాత ఓ అధికారికి జైలు శిక్షపడింది. ఆదాయపన్ను శాఖ మాజీ కమిషనర్ ఏకే పుర్వార్కు మూడేళ్లు, ఆయన భార్య ఛాయ పుర్వార్కు రెండేళ్ల చొప్పున శిక్ష వేశారు. ముంబై సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఆర్ ఎన్ జోషి ఈ మేరకు తీర్పు వెలువరించారు. పుర్వార్కు లక్ష, ఆయన భార్యకు 50 వేల రూపాయల చొప్పున జరిమానా వేశారు. 2001లో పుర్వార్ దంపతులపై సీబీఐ కేసు నమోదు చేసింది. సుదీర్ఘ విచారణ అనంతరం దోషులుగా తేలారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement