'విభజన చట్టంలోని హామీల అమలుకు కేంద్రం సిద్ధం'
ఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్జైట్లీతో బుధవారం ఢిల్లీలో కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి సుజనాచౌదరి, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ల భేటీ ముగిసింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక ప్యాకేజీ అంశాలపై వారు చర్చించినట్టు తెలుస్తోంది. సమావేశం అనంతరం సుజనాచౌదరి విలేకరులతో మాట్లాడారు.
విభజన చట్టంలోని హామీలు అమలు చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు. దీనిపై విధివిధానాల రూపకల్పనలో సమాలోచన జరుగుతున్నాయని ఆయన తెలిపారు. పోలవరానికి ఎంత మేరకు నిధులు అవసరమో అంత ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేయడం లేదని అన్నారు. కాగా, టీడీపీ ఎంపీ శివప్రసాద్ నిరసన వ్యక్తగతం.. పార్టీకి సంబంధం లేదని విలేకరుల అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మంత్రి సుజనా చౌదరి తెలిపారు.