న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఏ చిన్న సంఘటన జరిగిన అది దేశం మొత్తం మీద ప్రభావం చూపుతుంది. అదే భూకంపం లాంటి ప్రకృతి విపత్తులు ఢిల్లీలో సంభవిస్తే జరిగే నష్టాన్ని అంచనా కూడా వేయలేము. ఒకవేళ భూకంపం లాంటివి సంభవిస్తాయని ముందే తెలిస్తే దేశం అంతటా ఎంతటి భయాందోళనలు కల్గుతాయో మనం ఊహించగలం. ఇంతకు ఇప్పుడు ఈ అంశం ఎందుకు ప్రస్తావనకు వచ్చిందంటే ఏప్రిల్ 7 నుంచి 15లోపు ఢిల్లీలో ఒక తీవ్రమైన భూకంపం రానుంది. రిక్టారు స్కేలు మీద దాని తీవ్రత 9.1-9.2గా నమోదు కానుంది. లక్షల మంది ప్రాణాలు కొల్పోనున్నారని, దీనికి సంబంధించి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా) నుంచి హెచ్చరికలు కూడా వచ్చాయనే మెసేజ్ గత కొన్ని రోజులుగా వాట్సాప్‌లో చక్కర్లు కొడుతుంది.
గురుగ్రామ్‌లో సంభవించబోయే ఈ భూకంపం ప్రపంచంలో అత్యధిక ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగించిన వాటిలో రెండవది కానుంది. భారతదేశంలోని రాజస్థాన్, హర్యానా, పంజాబ్, జమ్ముకాశ్మీర్, తమిళనాడు, బిహార్ రాష్ట్రాలు భూకంప ప్రభావానికి గురికానున్నాయి. పాకిస్థాన్‌లో కూడా భూకంపం రానున్నట్లు అక్కడ దీని తీవ్రత 4-4.2 వరకు నమోదు కానున్నట్లు ఈ సందేశ సారాంశం. ఢిల్లీలో ఉంటున్న మీ స్నేహితులకు, బంధువులకు ఈ విషయాన్ని వెంటనే తెలియజేయండి. వారిని ఒక వారం పాటు ఢిల్లీని వదిలి వేరే ప్రాంతానికి వెళ్లమని చెప్పండి. ప్రభుత్వం తొందరలోనే దీని మీద స్పందించి తగిన చర్యలు తీసుకుంటుంది. ఇంకా ఎక్కువ సమాచారం కావాలంటే నాసాఅలర్ట్.కామ్‌లో చూడండి అని ఉంది.
అంటే నిజంగానే ఢిల్లీలో భూకంపం రానుందా... అంటే అదేమి లేదు. ఇది ఒక ఫేక్ మెసేజ్. మెసేజ్‌లో చాలా స్పెల్లింగ్ మిస్టెక్‌లు ఉండటమే కాక ఒక ముఖ్యమైన ప్రాధమిక అంశాన్నే అది మర్చిపోయింది. భూకంపాలను ముందుగా గుర్తించడం సాధ్యం కాదు. ఈ వెబ్‌సైట్ కూడా నకిలీ వెబ్‌సైట్. ఇది స్పేస్ ఏజెన్సీ నుంచి వచ్చిన అధికారిక సమాచారం కాదని తేలడంతో ఢిల్లీ వాసులు ఊపరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment