ఆర్మీ ఉద్యోగాల పేరుతో మోసం, 1.79 కోట్లు సీజ్‌ | fake army job racket busted, Rs 1.8 crore seized | Sakshi
Sakshi News home page

ఆర్మీ ఉద్యోగాల పేరుతో మోసం, 1.79 కోట్లు సీజ్‌

Published Wed, May 24 2017 2:34 PM | Last Updated on Tue, Sep 5 2017 11:54 AM

fake army job racket busted, Rs 1.8 crore seized

జైపూర్‌ : ఆర్మీ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల​కు టోకరా వేసిన ఓ ముఠా గుట్టును రాజస్థాన్‌ యాంటీ టెర్రరిజం స్వాడ్‌ రట్టు చేసింది.  ఈ ఘటనకు సంబంధించి సోమవారం సాయంత్రం నలుగురిని అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి రూ. 1.79 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ ర్యాలీలో పాల్గొన్న అభ్యర్థుల ఒరిజినల్‌ మార్క్‌ షీట్లలతో పాటు క్వాలిఫికేషన్‌ సర్టిఫికెట్లను సీజ్‌ చేశారు. ఈ కుంభకోణానికి సూత్రధారి అయిన అర్జున్‌సింగ్‌ను పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాతే మిగతా వివరాలు వెల్లడిస్తామని పోలీసులు వెల్లడించారు.

అంతేకాకుండా ఆర్మీ క్యాంటీన్‌ నుంచి కొనుగోలు చేసిన మద్యం బాటిళ్లను  కూడా సీజ్‌ చేసినట్లు తెలిపారు. నిరుద్యోగుల నుంచి ఈ ముఠా ఒక్కో పోస్ట్‌కు నాలుగు లక్షలు వసూలు చేయడంతో పాటు ఒరిజినల్‌ సర్టిఫికెట్లను సెక్యూరిటీ కింద తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఫిజికల్‌, మెడికల్‌ టెస్ట్‌ పూర్తియిన తర్వాత అభ్యర్థుల నుంచి మరికొంత మొత్తంలో ఈ ముఠా డిమాండ్‌  చేసినట్లు సమాచారం. కాగా ఈ వ్యవహారంలో ఆర్మీ సిబ్బందికి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.

Advertisement

పోల్

Advertisement