భువనేశ్వర్: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. పూరీ- అహ్మదాబాద్ ఎక్స్‌ప్రెస్ ఇంజిన్ లేకుండానే 17 కిలో మీటర్లు ప్రయాణించింది. అయితే సిబ్బంది అప్రమత్తతతో చివరకు రైలును నిలువరించగలిగారు. 22 బోగీలు ఇంజిన్ లేకుండా దాదాపు 17 కిలోమీటర్లు వరకు వెళ్లాయి.
టిట్లాగఢ్ వద్ద ఇంజిన్ మార్చే సమయంలో అప్రమత్తంగా ఉండకపోవటంతో రైలు దానంతట అదే పరుగులు తీసింది. వేగంగా కేసింగా ప్రాంతం వైపు దూసుకెళ్లిపోయింది. రైలు ఇంజిన్ లేకుండా వెళ్తున్న విషయాన్ని గమనించిన కొందరు ప్రయాణికులు స్టేషన్ సిబ్బందికి సమాచారం అందించారు. మరోవైపు రైల్లో ఉన్న ప్రయాణికులు భయంతో గట్టిగా కేకలు పెట్టారు. చివరకు పట్టాలపై రాళ్లను ఉంచిన అధికారులు.. రైలును నిలువరించగలిగారు. దీంతో ఘోర ప్రమాదం తప్పింది. ప్రయాణికలు సురక్షితంగా ఉన్నారని అధికారులు చెప్పారు. చివరకు కేసింగ నుంచి మరో ఇంజిన్ అమర్చి బోగీలను అధికారులు టిట్లాగఢ్‌కు తీసుకొచ్చారు. బ్రేకర్లు సరిగ్గా వేయకపోవటమే ఘటనకు కారణమన్న అధికారులు.. బాధ్యులైన ఇద్దరు సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment