బర్త్ డే పార్టీకని పిలిచి... | Man Befriends 15-Year-Old on Facebook, Rapes Her at a Party | Sakshi
Sakshi News home page

బర్త్ డే పార్టీకని పిలిచి...

Published Wed, Oct 7 2015 12:49 PM | Last Updated on Sat, Jul 28 2018 8:53 PM

బర్త్ డే పార్టీకని పిలిచి... - Sakshi

బర్త్ డే పార్టీకని పిలిచి...

ముంబై: బర్త్ డే పార్టీకని పిలిచి పదిహేనేళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి తెగబడిన ఘటన ముంబైలో చోటు చేసుకుంది. మాయ మాటలతో ఓ యువకుడు ఫేస్‌బుక్లో మైనర్ బాలికతో పరిచయం పెంచుకున్నారు. పుట్టిన రోజు పార్టీకని ఆమెను ఇంటికి ఆహ్వానించి, తన స్నేహితులతో కలిసి అత్యాచారం చేశాడు. పరువు పోతుందనే భయంతో ఫిర్యాదు చేయడానికి బాలిక తల్లిదండ్రులు భయపడ్డారు. బాలిక అస్వస్థతకు గురికావడంతో ఆలస్యంగా ఈ దారుణం వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళ్తే.. మూడు నెలల క్రితం బాధితురాలికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు నిందితుడు కౌస్తుభ్ చవాన్. పక్కా పథకం ప్రకారం ఈ మూడు నెలల కాలంలో బాలికను ప్రేమ పేరుతో నమ్మించాడు. సెప్టెంబర్ 30న తన బర్త్‌డే అని చెప్పి యువతిని ఇంటికి ఆహ్వానించాడు. అతడిని గుడ్డిగా నమ్మి చవాన్ నివాసానికి వెళ్లింది. చవాన్, మరో ఇద్దరు యువకులు ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.

తనపై జరిగిన దారుణాన్ని తల్లిదండ్రులకు బాధితురాలు చెప్పింది. కానీ సమాజంలో పరువు పోతుందనే భయంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అయితే సోమవారం ఆమెకు కడుపు నొప్పి, తలనొప్పి రావడంతో వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు.  బాధితురాలికి పరీక్షలు నిర్వహించిన  వైద్యులు అత్యాచారం జరిగిన విషయాన్ని నిర్ధారించారు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా చవాన్(21), దీపాళి హైర్(25), మందర్(30)ను నిందితులుగా గుర్తించామని సీనియర్ పోలీసు అధికారి  విబి  చందన్ శివే తెలిపారు. పక్కా ప్రణాళిక ప్రకారమే నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారన్నారు.  మంగళవారం నిందితులను అదుపులోకి తీసుకున్నామని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement