ఈశాన్య భారత్‌లో స్వల్ప భూకంపం | minor earthquake hits in northeast India | Sakshi
Sakshi News home page

ఈశాన్య భారత్‌లో స్వల్ప భూకంపం

Published Sat, Feb 25 2017 3:18 PM | Last Updated on Tue, Sep 5 2017 4:35 AM

ఈశాన్య భారత్‌లో స్వల్ప భూకంపం

ఈశాన్య భారత్‌లో స్వల్ప భూకంపం

త్రిపుర : ఈశాన్య భారతదేశంతో పాటు బంగ్లాదేశ్‌లో శనివారం వరుస భూప్రకంపనలు సంభవించాయి. అరుణాచల ప్రదేశ్‌లోని దిబాంగ్‌ లోయలో శనివారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం రాగా, త్రిపురలో మధ్యాహ్నం 12 ప్రాంతంలో భూమి కంపించింది.

దీంతో ప్రజలు భయాందోళనలతో ఇళ్లలోనుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రత రిక్టర్‌స్కేలుపై అరుణాచలప్రదేశ్‌లో 3.5, త్రిపురలో 4.0 గా నమోదైంది. భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement