ఇస్రో సాక్ డైరెక్టర్గా తపన్ మిశ్రా
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు చెందిన స్పేస్ అప్లికేషన్ సెంటర్ (సాక్) డైరెక్టర్గా తపన్ మిశ్రా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. సాక్ డైరెక్టర్గా పనిచేసిన ఏఎస్ కిరణ్ కుమార్ ఇస్రో చైర్మన్గా నియమితులవ్వడంతో ఆయన స్థానంలో మిశ్రా ఎంపికయ్యారు. 1984లో డిజిటల్ హార్డ్వేర్ ఇంజినీర్గా సాక్లో కెరీర్ ప్రారంభించిన మిశ్రా.. తన మాతృశాఖకే డైరెక్టర్ కావడం విశేషం.