అమెరికా పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్న మోడీ
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ ఐదు రోజుల అమెరికా పర్యటన ముగించుకుని స్వదేశం తిరిగొచ్చారు. బుధవారం రాత్రి మోడీ న్యూఢిల్లీ చేరుకున్నారు. మోడీ వెంట విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, ఇతర ప్రతినిధి బృందం అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. అమెరికాలో మోడీ పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు.