‘వీఐపీలు కాదు.. పౌరులు ముఖ్యం’
న్యూఢిల్లీ: వీఐపీలకంటే సాధారణ పౌరులే ముఖ్యం అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. అందుకే వీఐపీ సంస్కృతి స్థానంలో ఈపీఐ(ఎవ్రీ పర్సన్ ఇంపార్టెంట్) కల్చర్ తీసుకొస్తున్నామని తెలిపారు. ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడిన మోదీ పలు విషయాలను స్పృషించారు. సెలవుల్లో విద్యార్థులు కొత్త విషయాలు నేర్చుకోవాలని అన్నారు. ప్రజలు చాలా విషయాలు తన దృష్టికి తీసుకొస్తున్నారని, వారి నుంచి వచ్చిన సలహాలు స్వీకరిస్తానని అన్నారు.
వీఐపీలకు చిహ్నంగా ఉన్న తమ కార్లపై ఉండే ఎరుపు బుగ్గలను తొలగించామని, అది వ్యవస్థను ఆధునీకరించడంలో భాగమని, అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరూ తమ మనసుల నుంచి వీఐపీలం అనే ఆలోచనను తొలగించే ప్రయత్నం చేయాలని కోరారు. మే 5న భారత్ సౌత్ ఏసియా వాటిలైట్‌ను ప్రారంభించబోతోందని, అది భారత్‌కు ముఖ్యమైన ముందడుగని దాని ద్వారా మొత్తం సౌత్ ఆసియాతో సహాయసహకారాలు పెంపొందించుకోవచ్చిన అన్నారు.