దేశంలో తృణధాన్యాలకు ఢోకా లేదు
న్యూఢిల్లీ: దేశీయంగా తృణధాన్యాల ఉత్పత్తి సంతృప్తికరంగా ఉందని, దేశీయ అవసరాల కోసం వంట నూనె, కాయ ధాన్యాలను దిగుమతి చేసుకుంటున్నామని సుప్రీంకోర్టుకు కేంద్రం నివేదించింది. దేశంలో పెరిగిన రైతుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై వివరణ ఇస్తూ అఫిడవిట్‌లో వ్యవసాయ శాఖ ఈ వివరాలు తెలిపింది.
భారత్‌లో దేశీయ అవసరాలకేకాక ఎగుమతి చేసేంత స్థాయిలో గోధుమ, బియ్యం నిల్వలున్నాయని, ఆహార భద్రత పథకం ద్వారా వంట నూనెలు, కాయధాన్యాల ఉత్పత్తిని పెంచేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపింది. 48 శాతం పంటభూమిలో ఆహారధాన్యాలనే పండిస్తున్నారనే అభిప్రాయాలను కేంద్రం తోసిపుచ్చింది.