పార్లమెంటు సమాచారం | Parliament Information | Sakshi
Sakshi News home page

పార్లమెంటు సమాచారం

Published Sat, Mar 12 2016 1:23 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

Parliament Information

► సభాకార్యక్రమాలకు తరచూ ఆటంకం కలిగించే ఎంపీల సభ్యత్వాన్ని రద్దుచేయాలనే ప్రైవేటు బిల్లును టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
► స్వలింగ సంపర్కం నేరం కాదనే భారత శిక్షాస్మృతిలోని 377 సెక్షన్‌లో సవరణలు చేయాలంటూ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పెట్టిన బిల్లును లోక్‌సభ తిరస్కరించింది.
► విమాన ప్రయాణికులకు పరిహారాన్ని పెంచే బిల్లుకు పార్లమెంటు ఆమోదించింది.
► పొగాకు ఉత్పత్తులపై పుర్రె గుర్తు పరిమాణాన్ని తగ్గించాలని పార్లమెంటు ప్యానల్ ఉభయ సభలకు సూచించింది. దేశంలో 27.5 కోట్ల మంది పొగాకు ఉత్తత్తులను వినియోగిస్తున్నారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. 21 లక్షల మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులున్నారని చెప్పింది.
► భారతదేశంలోని 20 విద్యాసంస్థలు ప్రపంచ స్థాయిలో ఉండేలా సహాయం చేయనున్నట్లు స్మృతి ఇరానీ తెలిపారు.
► మార్చి 2019 కల్లా అన్ని రేషన్ షాపులను డిజిటలైజ్ చేస్తామని కేంద్ర వ్యవసాయ  మంత్రి పాశ్వాన్ తెలిపారు.
► యూరియాకు వేప పూత ఉండాలన్న ప్రభుత్వ నిబంధన కారణంగా యూరియా వినియోగం తగ్గిందని కేంద్ర మంత్రి హన్స్‌రాజ్ ఆహిర్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement