న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, బిహార్, ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోని దిగువ కోర్టుల్లో దాదాపు 84 శాతం (20.3 లక్షలు) కేసులు పెండింగ్‌లో ఉన్నాయని కేంద్ర న్యాయశాఖ వెల్లడించింది. ఈ కేసులు దశాబ్దానికి పైగా అపరిష్కృతంగా పడిఉన్నాయంది.
వీటిలో 70 శాతం క్రిమినల్ కేసులుకాగా, మిగతావి సివిల్ కేసులని తెలిపింది. వివిధ రాష్ట్రాలు కేసుల పరిష్కారంలో జాప్యంపై వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవట్లేదని, అలాగే ఆయా రాష్ట్రాల్లో ఉన్న సామాజిక ఆర్థిక పరిస్థితులు పెండింగ్ కేసులను తగ్గించలేకపోతున్నాయని కేంద్రం భావిస్తోంది.
ఆరు రాష్ట్రాల్లో 84 శాతం పెండింగ్ కేసులు
Published Tue, Dec 13 2016 8:15 PM | Last Updated on Tue, Nov 6 2018 4:55 PM
Advertisement