సాక్షి, హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే 2017-18 ఆర్థిక సంవత్సరంలో ప్రగతి పథంలో దూసుకుపోయిందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ యాదవ్ ఒక ప్రకటణలో తెలిపారు. గడిచిన ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 13673 కోట్ల ఆదాయం వచ్చిందని, ఇందులో ప్రజా రవాణా ద్వారా రూ. 3861 కోట్లు, సరుకు రవాణా ద్వారా రూ. 9260 కోట్లు ఆర్జించినట్టు వెల్లడించారు. 2016-17 తో పొల్చితే 12 శాతం వృద్ధి సాధించామని పేర్కొన్నారు. 20 అంశాల్లో ఉత్తమ సేవలు అందించినందుకుగాను ఉత్తమ రైల్వే అవార్డు దక్కించుకున్నట్టు తెలిపారు.
సగటున రోజుకు 10.4 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నట్టు తెలిపారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 113 కిలోమీటర్ల కొత్త రైల్వేలైన్లను పూర్తి చేసి, మరో 600 కిలోమీటర్ల రైల్వే లైన్లను విద్యుద్దీకరణ చేసినట్టు తెలిపారు. ప్రయాణికుల భద్రత, రక్షణకు రైల్వే అధిక ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. అలాగే గత సంవత్సరం 7237 కొత్త కోచ్‌లతో 1454 ప్రత్యేక రైళ్లు నడిపించినట్టు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment