కేంద్ర కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంస్థలు వస్తువులు, సేవలు కొనుగోలు చేయడానికి వేదికగా పనిచేస్తున్న ‘గవర్నమెంట్ ఈ–మార్కెట్‌ప్లేస్’ (జీఈఎం) పోర్టల్‌ను నిర్వహించడానికి ఎలాంటి లాభాపేక్ష లేని ప్రత్యేక సంస్థ(ఎస్‌పీవీ)ని ఏర్పాటుచేయాలని కేంద్రం నిర్ణయించింది. బుధవారం ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థలు, పీఎస్‌యూలు, స్వతంత్ర ప్రతిపత్తి గల కంపెనీలు, స్థానిక సంస్థలు తమకు అవసరమైన వస్తువులు, సేవలను ఆన్‌లైన్‌లో పూర్తి పారదర్శకంగా సేకరించడానికి జీఈఎం ఎస్‌పీవీ తోడ్పడుతుంది. అలాగే ప్రస్తుతం వాణిజ్య శాఖ పరిధిలో నడుస్తున్న డైరెక్టర్ జనరల్ ఆఫ్ సప్లైస్ అండ్ డిస్పోజల్‌ని అక్టోబర్ 31 నాటికి రద్దుచేయాలని కూడా నిర్ణయించింది.
కేబినెట్ ఇతర నిర్ణయాలు
► 11 కేంద్ర ప్రభుత్వ సంస్థలను స్టాక్ మార్కెట్లలో నమోదుచేయడానికి ఆమోదం లభించిం ది. వీటిలో రైల్వే శాఖ అధీనంలోని 5 సంస్థలు కూడా ఉన్నాయి.
► పామాయిల్ సాగు ఆర్థిక సాయానికి ఉన్న గరిష్ట భూ పరిమితి నిబంధనను కేంద్రం సడలించింది. రైతులు, కార్పొరేట్లను ఈ రంగంలోకి ఆకర్షించి దేశీయంగా పామాయిల్ దిగుబడి పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో 25 హెక్టార్లకు పైగా పామాయిల్ సాగుచేసే వారికీ రాయితీలు, ఆర్థిక సాయం అందుతాయి.
ఆన్‌లైన్ కొనుగోళ్లకు ప్రత్యేక సంస్థ
Published Thu, Apr 13 2017 2:09 AM | Last Updated on Tue, Aug 21 2018 9:33 PM
Advertisement