న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా బొగ్గు గనులపై వేలం ప్రక్రియ నిర్వహణకు వీలుకలిగించే ఆర్టినెన్స్‌ను సవాలు చేస్తూ కోల్‌కతా ఎలక్ట్రిక్సప్లై కార్పొరేషన్ సహా రెండు ప్రైవేటు సంస్థలు వేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు గురువారం తిరస్కరించింది. అక్రమ గనుల తవ్వకానికిగాను జరిమానా చెల్లింపునకు ఈ నెల 31 వరకూ విధించిన గడువును పొడిగించాలంటూ జిందాల్ స్టీల్, జిందాల్ స్టీల్ అండ్ పవర్ సహా 3 సంస్థలు వేసిన పిటిషన్లనూ నిరాకరించింది. కాగా, కోర్టు ఆదేశాలతో కేటాయింపులు రద్దయిన 204 బొగ్గు క్షేత్రాల తాజా కేటాయింపు ప్రక్రియకు కేంద్రం సన్నద్ధమైంది. తొలిదశలో 65 గనుల వేలం ద్వారా ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు, మరో 36 బొగ్గు క్షేత్రాలను ప్రభుత్వరంగ సంస్థలకు కేటాయించేందుకు బిడ్డింగ్ పద్ధతిని సిద్ధం చేసింది.
కోల్ ఆర్డినెన్స్‌పై పిటిషన్లకు సుప్రీం ‘నో’
Published Fri, Dec 19 2014 2:42 AM | Last Updated on Sat, Sep 2 2017 6:23 PM
Advertisement