శ్రీ జయనామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు
మాఘ మాసం
తిథి శు.ద్వాదశి రా.12.21 వరకు
నక్షత్రం మృగశిర ప.3.44 వరకు
తదుపరి ఆరుద్ర
వర్జ్యం రా.12.32 నుంచి 2.13 వరకు
దుర్ముహూర్తం ఉ.6.37 నుంచి 8.08 వరకు
అమృతఘడియలు ప.12.02 నుంచి 1.38 వరకు
సూర్యోదయం : 6.37
సూర్యాస్తమయం: 5.50
రాహుకాలం: ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుంచి 3.00 వరకు
భవిష్యం
మేషం: నూతనోత్సాహంతో ముందడుగు వేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు హోదాలు.
వృషభం: కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు.
మిథునం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభకు గుర్తింపు రాగలదు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు.
కర్కాటకం: శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. బంధువర్గంతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు ఒత్తిడులు.
సింహం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. వస్తు, వస్త్రలాభాలు. ఉద్యోగలాభం. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.
కన్య: నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో పురోగతి. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారులకు అధిక లాభాలు. ఉద్యోగులకు విధుల్లో చికాకులు తొలగుతాయి.
తుల: రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా కొద్దిపాటి చికాకులు. శ్రమ పడ్డా ఫలితం ఉండదు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు. దైవదర్శనాలు.
వృశ్చికం: ఆర్థిక ఇబ్బందులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. విచిత్రమైన సంఘటనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.
ధనుస్సు: కొత్త పరిచయాలు. సంఘంలో ఆదరణ. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు.
మకరం: కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.
కుంభం: పనుల్లో జాప్యం. ఆర్థిక లావాదేవీలు విరాశ కలిగిస్తాయి. శ్రమ పెరుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. ధనవ్యయం.
మీనం: రాబడి తగ్గుతుంది. అనుకోని ప్రయాణాలు. రుణాలు చేస్తారు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. దైవచింతన.
- సింహంభట్ల సుబ్బారావు
గ్రహం అనుగ్రహం, శనివారం 31, జనవరి 2015
Published Sat, Jan 31 2015 3:49 AM | Last Updated on Tue, Aug 21 2018 12:03 PM
Advertisement
Advertisement