శ్రీ జయనామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు
మాఘ మాసం; తిథి బ.చవితి ప.12.02 వరకు; తదుపరి పంచమి; నక్షత్రం ఉత్తర ఉ.6.02 వరకు; తదుపరి హస్త
వర్జ్యం ప.3.26 నుంచి 4.11 వరకు
దుర్ముహూర్తం సా.4.28 నుంచి 5.18 వరకు; అమృతఘడియలు రా.1.55 నుంచి 3.44 వరకు
సూర్యోదయం: 5.51;
సూర్యాస్తమయం: 6.07
రాహు కాలం- సా. గం. 4.30 నుంచి గం.6.00 వరకూ
యమగండం- మధ్యాహ్నం. గం. 12 నుంచి 1.30 వరకూ
భవిష్యం
మేషం: పనులు విజయవంతంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ధన, వస్తులాభాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.
వృషభం: కొన్ని కార్యక్రమాలు నత్తనడకన సాగుతాయి. వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.
మిథునం: బంధుమిత్రులతో మాటపట్టింపులు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. పనుల్లో జాప్యం. ఆలోచనలు కలసిరావు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
కర్కాటకం: కుటుంబసభ్యులతో వివాదాలు తీరతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. మీ సత్తా చాటుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
సింహం: కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ధనవ్యయం. కొన్న కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.
కన్య: కొత్త పనులకు శ్రీకారం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
తుల: పనులు మధ్యలో విరమిస్తారు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. అనారోగ్యం. శ్రమ పడ్డా ఫలితం ఉండదు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
వృశ్చికం: కుటుంబ సమస్యలు తీరతాయి. వ్యవహారాలు సానుకూలం. విందువినోదాలు. ఆస్తిలాభం. వాహన, గృహయోగాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
ధనుస్సు: దూరపు బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవలకు గుర్తింపు రాగలదు. కార్యజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. అంచనాలు నిజమవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి.
మకరం: రుణఒత్తిడులు. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగయత్నాలు నెమ్మదిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం.
కుంభం: ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. బంధువులతో వివాదాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి.
మీనం: పలుకుబడి పెరుగుతుంది. పనులలో విజయం. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. ఆధ్యాత్మిక చింతన.
- సింహంభట్ల సుబ్బారావు