బెంజ్‌సర్కిల్‌లో చంద్రబాబు హైడ్రామా | Chandrababu Naidu Drama At Benz Circle In Vijayawada | Sakshi
Sakshi News home page

బెంజ్‌సర్కిల్‌లో చంద్రబాబు హైడ్రామా

Published Wed, Jan 8 2020 10:51 PM | Last Updated on Wed, Jan 8 2020 10:56 PM

Chandrababu Naidu Drama At Benz Circle In Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ : పాదయాత్ర పేరుతో చంద్రబాబునాయుడు బుధవారం విజయవాడలో హడావుడి చేశారు. బెంజ్ సర్కిల్ వద్ద అనుమతి లేని ర్యాలీ చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించారు. విజయవాడలోని బెంజ్ సర్కిల్ నుంచి ర్యాలీగా ఆటోనగర్ వరకూ పాదయాత్రగా వెళ్లేందుకు చంద్రబాబు యత్నించారు. అయితే ర్యాలీకి అనుమతులు లేవని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రెచ్చిపోయిన పచ్చపార్టీ నాయకులు.. పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. పోలీసు వ్యాన్‌ తాళం దొంగిలించడమే కాకుండా.. తమ నేతను అరెస్ట్‌ చేస్తారా అంటూ వాగ్వాదానికి దిగారు. చంద్రబాబును అరెస్ట్‌ చేస్తున్నారు.. బెంజ్‌సర్కిల్‌కు రావాలంటూ టీడీపీ ఆఫీస్‌ నుంచి కార్యకర్తలకు మెసేజ్‌లు పంపి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో టీడీపీ కార్యకర్తలు బెంజ్‌సర్కిల్‌ వద్దకు వచ్చి గంటపాటు హడావుడి చేశారు. చంద్రబాబు తానా అంటే తందానా అంటూ పచ్చమీడియా ఏదో జరిగినట్లు ప్రసారం చేసింది. ఇక చంద్రబాబు చేసిన హైడ్రామాకు భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement