
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో ఉనికి కోసం రాష్ట్ర కాంగ్రెస్ సర్వ శక్తులు ఒడ్డింది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ ప్రజాబలం ముందు కుదేలవడంతో లోక్‌సభ ఎన్నికలపైనే ఆశలు పెట్టుకుంది. కనీసం ఒకట్రెండు సీట్లలో అయినా గెలిస్తేనే భవిష్యత్తు ఉంటుం దని లేకపోతే ఉనికే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితులు పొంచి ఉన్నాయని కలవరపడుతోంది. 2014 ఎన్నికలకంటే ఎక్కువ స్థానాలు గెలుస్తామని, వీలైతే డబుల్ డిజిట్ సంఖ్యకు చేరుకుం టామని బలంగా ప్రకటించుకున్న బీజేపీ కేవ లం ఒక్క స్థానానికే పరిమితమై నైరాశ్యంలో మునిగిపోగా ఈసారి కచ్చితంగా అధికార పగ్గా లు చేపడతామని ధీమా ప్రదర్శించిన కాంగ్రెస్ కేవలం 19 సీట్లకే పరిమితమైంది. అందులో నూ వివిధ కారణాలు చెప్పి 10 మంది ఎమ్మెల్యేలు ‘కారు’ ఎక్కేశారు. ఫలితంగా సింగిల్ డిజిట్ కు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య పడిపోయింది. మిగిలినవారిలో ఎంతమంది ఉంటారో, ఎంతమంది గులాబీ కండువా కప్పుకుంటారో పార్టీ నేతలకే తెలియని అయోమయం నెలకొంది.
మనుగడ కోసం పోరాటం...
అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్‌నగర్ స్థానం నుంచి విజయం సాధించిన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లోక్‌సభ ఎన్నికల బరిలో దిగడమే పార్టీ పరిస్థితిని స్పష్టం చేస్తోంది. ఎట్టిపరిస్థితిల్లో కొన్ని సీట్లు గెలిచి తీరాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ అధిష్టానం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఎమ్మెల్యేగా ఉన్న ఉత్తమ్‌ను నల్లగొండ నుంచి బరిలో దింపింది. నల్లగొండలో జెండా ఎగరేయాలనేది పార్టీ ఆలోచన. ఇక స్థానికుడు కానప్పటికీ రేవంత్‌రెడ్డిని మల్కాజిగిరిలో నిలిపింది. మాటకారితనం, మాస్‌లో ఆయనకున్న పేరు, కుల సమీకరణం, ఆర్థిక స్తోమత... అన్నింటిని బేరీజు వేసుకుని ఆయనను దింపింది. టీఆర్‌ఎస్ టికెట్లు దక్కని వారికి గాలం వేసి కొన్నిచోట్ల నిలపాలని కూడా యత్నించింది. పది చోట్ల గెలుస్తామని ఆ పార్టీ చెబుతున్నా కనీసం 2, 3 సీట్లు వచ్చినా పార్టీ నిలుస్తుందన్న అభిప్రాయం నేతల్లో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment