మోదీ మెజీషియన్‌లా వ్యవహరిస్తున్నారు | Like magician, Modi tries to divert attention | Sakshi
Sakshi News home page

మోదీ మెజీషియన్‌లా వ్యవహరిస్తున్నారు

Published Sun, Dec 10 2017 5:26 AM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

Like magician, Modi tries to divert attention - Sakshi

వాద్‌నగర్‌/పటాన్‌: వాస్తవ అంశాలను మరుగు పరిచి, జనం దృష్టి మరల్చేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ విమర్శించారు. మోదీ సొంతూరు వాద్‌నగర్‌లో జరిగిన సభలో ప్రసంగించారు. మెజీషియన్‌ ట్రిక్కులు ప్రదర్శించే సమయంలో జనం చూపు పక్కకు మరల్చేందుకు ప్రయత్నించినట్లే మోదీ గత 15 రోజులుగా నిజాలను దాస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రైతు రుణాలను మాఫీ చేస్తుందని హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ ఎన్నికల ప్రసంగాల్లో గుజరాత్‌ అభివృద్ధికి సంబంధించిన విషయాలే కనిపించడం లేదని ఆరోపించారు. నర్మద జలాల అంశం, రిజర్వేషన్లు, రాష్ట్రాభివృద్ధి వంటి వాటిపై బీజేపీ వైఫల్యం తెలుస్తుండడంతో అయ్యర్‌ ట్వీట్ల అంశాన్ని మోదీ ప్రస్తావిస్తున్నారని తెలిపారు. ఇది ఎన్నికల ప్రచార అంశమేనా అని ప్రశ్నించారు. నర్మదా జలాలను గ్రామాలకు తరలిస్తామని మోదీ హామీ ఇచ్చినప్పటికీ ఆ నీళ్లు టాటాల నానో ఫ్యాక్టరీకే వెళ్తున్నాయన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement