సాక్షి, బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తమదేనంటూ అటు అధికార కాంగ్రెస్, ఇటు బీజేపీ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని చోట్ల ఈవీఎంల ట్యాంపరింగ్ అంటూ ఆరోపణలు మరోవైపు మండుటెండలోనూ కొన్ని ప్రాంతాల్లో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే తమ వివాహం జరుగుతున్న రోజే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నా సరే.. తమ వంతు బాధ్యతగా కొన్ని యువ జంటలు పోలింగ్ కేంద్రాలకు రావడం ఆకట్టుకుంటోంది.
మడికెరిలోని 131వ నెంబర్ పోలింగ్ బూత్‌లో ఓ నవ వధువు పెళ్లి దుస్తులతో వచ్చి ఓటేశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఓటేయడం మన బాధ్యత అన్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న వెంటనే వివాహవేడుక స్థలానికి వెళ్లిపోయారు. మంగళూరులో కూడా వియోలా అనే నవ వధువు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటేసిన తర్వాత ఆమె తన కుటుంబంతో కలిసి ఫంక్షన్ హాలుకు వెళ్లారు. ధర్వాడ్‌లో వరుడు మల్లికార్జున్ గోమంఘట్టి, వధువు నికితా పోలింగ్ కేంద్రం 190-ఏ వద్దకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రానికి వచ్చిన మల్లికార్జున్, నికితా క్యూ లైన్లో నిల్చుని, తమ వంతు వచ్చినప్పుడు ఓటేశారు. పలు ప్రాంతాల్లో వధూవరులు ఓటు హక్కు వినియోంగిచుకుని దాని విలువను నిరూపిస్తున్నారు.
మడికెరిలో ఓటేసిన అనంతరం నవ వధువు
Comments
Please login to add a commentAdd a comment