సాక్షి, కృష్ణా: టీడీపీ నాయకులు ఓటమి భయంతో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని వైఎస్సార్ సీపీ నాయకులు డీవై దాస్ విమర్శించారు. జిల్లాలోని పామర్రులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహిళలు అందరూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి తోడుగా ఉన్నారని అన్నారు. వారి ఓట్లు వైఎస్ జగన్‌కే పడ్డాయని ధీమా వ్యక్తం చేశారు. అన్ని వర్గాల మద్దతు వైఎస్సార్‌సీపీకే ఉందన్నారు. టీడీపీ ఈవీఎంలపై అనవసరపు రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. 2014లో అవే ఈవీఎంలతో టీడీపీ గెలుపొందిన విషయం గుర్తులేదా అని ప్రశ్నించారు. పసుపు-కుంకుమ పేరుతో చంద్రబాబు ప్రజల సొమ్మును ఖర్చు చేశారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీసీ విజయం ఖాయమని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment