న్యూఢిల్లీ: ఐదేళ్ల క్రితం భారత్‌లో జరిగే క్రికెట్ మ్యాచ్‌ల ప్రసార హక్కుల కోసం స్టార్ గ్రూప్ చెల్లించిన మొత్తం రూ. 3,851 కోట్లు. ఇప్పుడు వచ్చే ఐదేళ్ల కాలానికి ఇవే హక్కుల కోసం జరుగుతున్న వేలంలో ప్రస్తుతం పాట రూ. 4,442 కోట్ల వద్ద ఆగింది. ఇది గతంతో పోలిస్తే 15 శాతం ఎక్కువ. రెండో రోజు బుధవారం కూడా వేలం కొనసాగుతుంది. దాంతో బీసీసీఐ ఆశించినట్లుగా అతి భారీ మొత్తానికి హక్కులు అమ్ముడుపోయే అవకాశం కనిపిస్తోంది. మొదటి రోజు సాగిన ఈ–వేలంలో ప్రపంచ వ్యాప్తంగా టీవీ, డిజిటల్ ప్రసారహక్కులకు సంబంధించిన గ్లోబల్ కన్సాలిడేటెడ్ మీడియా రైట్స్ (జీసీఆర్) కోసం మూడు సంస్థలు చివరి వరకు పోటీలో నిలిచాయి.
స్టార్, సోనీ, రిలయెన్స్ జియోలు టెక్నికల్ బిడ్ సమర్పించి వేలంలో పాల్గొనగా... మిగతా మూడు సంస్థలు గూగుల్, ఫేస్‌బుక్, యప్ టీవీ తప్పుకున్నాయి. ఈ మూడు సంస్థలు స్టార్, సోనీ, జియోలతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ–వేలంలో జీసీఆర్ ముందుగా రూ.4,176 కోట్లతో ప్రారంభమైంది. ఆ తర్వాత ఇది 25 శాతం పెరుగుతూ పోయింది. 4,244 కోట్లు... 4,303 కోట్లు... 4328.25 కోట్లు... ఇలా వేలంలో హక్కుల కోసం మూడు సంస్థలు పోటీ పడ్డాయి. మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు ఈ–వేలం జరిగింది. నేడు ఉదయం 11 గంటల నుంచి ఇది మళ్లీ కొనసాగుతుంది.
ప్రస్తుతం రూ.4,442 కోట్లు
Published Wed, Apr 4 2018 1:21 AM | Last Updated on Wed, Apr 4 2018 1:21 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment