![ప్రత్యూషకు మరో గెలుపు](/styles/webp/s3/article_images/2017/09/4/61478980395_625x300.jpg.webp?itok=S6pad7OD)
ప్రత్యూషకు మరో గెలుపు
న్యూఢిల్లీ: జాతీయ మహిళల ప్రీమియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి బొడ్డ ప్రత్యూష మూడో విజయాన్ని సాధించింది. మహాలక్ష్మితో శనివారం జరిగిన తొమ్మిదో రౌండ్ గేమ్‌లో నల్లపావులతో ఆడిన ప్రత్యూష 40 ఎత్తుల్లో గెలిచింది. తొమ్మిదో రౌండ్ తర్వాత ప్రత్యూష 3.5 పారుుంట్లతో 11వ స్థానంలో ఉంది. మరోవైపు పద్మిని రౌత్ ఏడు పారుుంట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. 12 మంది క్రీడాకారిణిల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరుగుతున్న ఈ టోర్నీలో మరో రెండు రౌండ్‌లు మిగిలి ఉన్నారుు.